భారత్ సమాచార్, తెలంగాణ: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జీవితాన్ని ఆవిష్కరించే బయోపిక్ త్వరలో తెరకెక్కనుంది. ‘శ్రీనన్న అందరివాడు’ అనే టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా రాజకీయ రంగంలో ఆయన సాధించిన విజయాలు, ప్రజలతో ఆయన అనుబంధం, వ్యక్తిగత జీవితంలోని ముఖ్య ఘట్టాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.
సీనియర్ నటుడు సుమన్ ఈ చిత్రంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రను పోషించనుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. తన గంభీరమైన నటనతో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో సుమన్ ఆ పాత్రకు న్యాయం చేస్తారనే నమ్మకం చిత్ర బృందానికి ఉంది.…





