భారత్ సమాచార్, నల్లగొండ జిల్లా: త్రిపురారం మండలం రాగడప గ్రామంలో నూతనంగా నిర్మించనున్న గ్రామ సంఘబంధం భవన నిర్మాణానికి ఈరోజు భూమి పూజా కార్యక్రమం నిర్వహించారు. 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించబోయే ఈ భవనానికి సర్పంచ్ షేక్ సఫియా బేగం గురువారం నాడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న మహిళా సంఘాలు అతి తక్కువ వడ్డీతో రుణాలు తీసుకొని తిరిగి చెల్లించడం జరుగుతుందని, అందుకోసం గ్రామంలో ఉన్న మహిళ సంఘాలు సమావేశం నిర్వహించుకోవడానికి అణువుగా ప్రభుత్వం…