భారత్ సమాచార్, మెదక్ జిల్లా: స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ జిల్లాలో సజావుగా, ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం నిజాంపేట మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 492 పంచాయతీల్లో ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదలైందని, నిజాంపేట మండలంలోని 16 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆదివారం రెండో విడత నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.
నామినేషన్ వేసే అభ్యర్థులు…





