భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: వనపర్తి మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా బీసీలకు అవకాశం కల్పించాలని వనపర్తి నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కుందేళ్ళ అర్జున్ యాదవ్ డిమాండ్ చేశారు. వనపర్తి మున్సిపాలిటీ ఏర్పాటు లక్ష్మయ్య నుంచి నేటి చైర్మన్ గట్టు యాదవ్, మహేష్ వరకు జనరల్ లో కూడా బీసీలకే చైర్మన్ పదవీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు అలా కాకుండా అగ్రవర్ణ వ్యాపారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వొద్దన్నారు. వ్యాపారులకు వ్యాపార ఆలోచనలు తప్ప ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన వుండదన్నారు. గతంలో ఉన్న…