భారత్ సమాచార్.నెట్, యాదాద్రి భువనగిరి జిల్లా : ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా కీలక పాత్ర పోషిస్తాయని ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య అన్నారు. జిల్లాలోని మోటకొండూరు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మండల ప్రెస్ క్లబ్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య మీడియా వారధిగా పనిచేస్తుందని, ప్రజల సమస్యలను గుర్తించి నిజాన్ని నిష్పక్షపాతంగా తెలియజేయాలని సూచించారు.
అనంతరం ప్రెస్ రిపోర్టర్ల బృందం మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై రాజకీయాలు, కులమతాలకు అతీతంగా…





