భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన నూతన సర్పంచులకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి ఆవుల రాజిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, గ్రామాభివృద్ధే లక్ష్యంగా సర్పంచులు పనిచేయాలని ఆయన కోరారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా అందరినీ కలుపుకొని సమష్టిగా ముందుకు సాగాలని సూచించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాజిరెడ్డి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
‘గ్రామాభివృద్ధే లక్ష్యంగా సర్పంచులు పనిచేయాలి’





