భారత్ సమాచార్, నిజామాబాద్‌ జిల్లా: నిజామాబాద్ నగరంలోని మల్లు స్వరాజ్యం ట్రస్ట్‌లో శ్రమజీవుల సాహిత్యం, సాంస్కృతిక రంగంలో విశేష సేవలు అందించిన ఆరెట్టి 14వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు సిర్ప లింగం మాట్లాడుతూ.. ఆరెట్టి ప్రజల సమస్యలను సాహిత్యం, నాటికలు, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా సులభంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన బహుముఖ ప్రజ్ఞశాలి అని కొనియాడారు. జోగిని వ్యవస్థ, గుట్కా వంటి సామాజిక సమస్యలపై ఆయన రూపొందించిన నాటికలు ప్రజల్లో చైతన్యం కలిగించాయని తెలిపారు. ఆయన ఆశయాలను…