భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి: గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ‘డిజిటల్ హ్యుమానిటీస్’పై మూడు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం (ఎఫ్‌డీపీ) సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. సాంప్రదాయ మానవీయ శాస్త్రాలను అభివృద్ధి చెందుతున్న డిజిటల్ టెక్నాలజీతో అనుసంధానించడం, టెక్స్ట్, ఆడియో డిజిటలైజేషన్, డేటా విజువలైజేషన్ వంటి అంశాలపై అధ్యాపక సభ్యులకు ఆచరణాత్మక శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ప్రారంభ సెషన్‌లో జాదవ్ పూర్ వర్సిటీ ప్రొఫెసర్లు అభిజిత్ గుప్తా, డాక్టర్ అమృతేష్…