భారత్ సమాచార్.నెట్, భద్రాద్రి కొత్తగూడెం: కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు అటవీ ప్రాంతంలో పోడు భూముల విషయంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గోవిందు, బీట్ ఆఫీసర్ కోటిపై వలస గిరిజనులు వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో అధికారులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ దాడిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని క‌థ‌నాలు

బీసీ బంద్‌కు ఆర్టీసీ మద్దతు