భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతామని TRS పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పూరెళ్ళ శ్రావణ్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం TRS పార్టీ నూతన కార్యాలయాన్ని శ్రావణ్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులకు పెండింగ్లో ఉన్న పరిహారాన్ని…






