భారత్ సమాచార్, యాదాద్రిభువనగిరి జిల్లా: బీబీనగర్ మండలం రావిపహాడ్ గ్రామంలో ఉగాది పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని హనుమాన్ ఆలయంలో అర్చకుడు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తెలుగు నూతన సంవత్సరం పంచాగాన్ని వినిపించారు. ఈ సందర్బంగా గ్రామ పాలక మండలి సభ్యులు, గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. అందరూ సమన్వయంతో గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేడబోయిన వెంకటేష్, ఉప సర్పంచ్ ఇంద్రియాల బుచ్చయ్య, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, శివాజి యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.