భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండలంలో అకాల వర్షం అన్నదాతను తీవ్రంగా నష్టపరిచింది. మంగళవారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లారీలు, హమాలీలు, గన్ని బ్యాగుల కొరత వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులు ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షం కు తడిసిపోయి…