భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కేంద్రంలోని వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్లో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి, ప్రజా యుద్ధనౌక గద్దర్ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిన్నాల కట్టయ్య మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వం, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జీవితాంతం అహర్నిశలు కృషి చేసి ఉద్యమానికి సిద్ధాంతపరమైన బలాన్ని అందించిన మహనీయుడు ప్రొఫెసర్…





