భారత్ సమాచార్.నెట్, ములుగు జిల్లా : ములుగులోని ప్రముఖ వ్యాపారి దుబాసి రమేష్ తల్లి లక్ష్మి నర్సమ్మ మరణం పట్ల వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనారోగ్యంతో కన్నుమూసిన ఆమె భౌతిక దేహానికి సోమవారం ఆమె నివాసంలో పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. ఇలాంటి కష్టకాలంలో దుబాసి కుటుంబానికి తమ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. దుబాసి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్…





