భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్ర అదనపు గదుల ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల మున్నూరు కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు హాజరయ్యారు. సంఘం ప్రతినిధులు ఆది చందు, రాయల శేఖర్, గుండ్ల వెంకన్న (ఉప్పన్న), బొల్లం చంద్రయ్య తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంఘం ప్రతినిధి, చిన్న ముప్పారం…





