భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy)లో విరాట్ కోహ్లి (Virat Kohli) మూడో మ్యాచ్ ఆడతాడని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. న్యూజిలాండ్‌తో సిరీస్ సన్నాహకాల నేపథ్యంలో కోహ్లి రైల్వేస్‌తో జరగనున్న మ్యాచ్‌కు దూరమైనట్లు ఢిల్లీ జట్టు కోచ్ వెల్లడించాడు. ఇప్పటికే ఈ ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి (Virat Kohli) అద్భుత ప్రదర్శన చేశాడు. ఆంధ్రతో జరిగిన మొదటి మ్యాచ్‌లో అజేయ సెంటరీ (131) చేశాడు. అనంతరం గుజరాత్‌లో జరిగిన మ్యాచ్‌లో 77 పరుగులు చేశాడు.