భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ : నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్-II ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రోగ్రాం ఆఫీసర్ పెద్దూరి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదని, దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తి ఓటుకు ఉందని పేర్కొన్నారు. యువత రాజకీయ అవగాహన పెంపొందించుకోవాలని, 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ…
ఓటు హక్కును వినియోగించుకోవాలి: ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి





