భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం బోధన్ పట్టణంలోని విజయమేరీ హైస్కూల్‌లో ఏర్పాటు చేయనున్న ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను పరిశీలించారు. బోధన్ మున్సిపాలిటీకి అవసరమైన ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియకు పాఠశాల భవనం అనువుగా ఉందా అనే అంశాన్ని సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గదుల వినియోగం, సిబ్బంది కదలికలు, రవాణా మరియు పార్కింగ్ సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సబ్ కలెక్టర్ వికాస్ మహతో, మున్సిపల్ కమిషనర్ జాదవ్…