భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: గుమ్మడిదల మున్సిపాలిటీలోని 22 వార్డుల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పార్టీ పూర్తిస్థాయిలో ఎన్నికల బరిలో నిలిచిందని మున్సిపల్ ఇంఛార్జ్ పట్నం మాణిక్యం స్పష్టం చేశారు. పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని, నాయకత్వం నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు అందరూ ఒకే దిశగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. పార్టీ నిర్ణయాలపై స్పష్టత ఉందని, అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత పాటించామని వివరించారు. ఎవరికీ అన్యాయం జరగలేదని, పార్టీ ప్రయోజనాలే ప్రధానంగా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. పార్టీ…