భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాల ఆరోగ్యకరమైన జీవనం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ ఎం. హేమలత పిలుపునిచ్చారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాల మేరకు మెదక్ జిల్లా నర్సాపూర్ కోర్టు ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్వయంగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
…





