భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఇంట్లో నుంచి వెళ్లి యువకుడు అదృశ్యమైన ఘటన నర్సాపూర్ పట్టణంలో చోటు చేసుకుంది. నర్సాపూర్ పట్టణానికి చెందిన గూని భానుప్రసాద్(18) ఈ నెల 7న ఇంట్లో నుంచి పనికి వెళ్లి తిరిగి రాలేదు. తండ్రి గూని నాగభూషణం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






