భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలోని వీ మార్ట్‌లో ఓ యువతి పనికని వెళ్లి అదృశ్యమైంది. నర్సాపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తులసి ప్రతిరోజూ లాగే నర్సాపూర్‌లో వీ మార్టులో పనికి వెళ్లిన తులసి ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు స్థానికంగా, బంధువుల వద్ద ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నారాయణపూర్ గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ రాజుపై అనుమానం ఉందని కుటుంబసభ్యులు తెలపగా మిస్సింగ్ కేస్ నమోదు చేసినట్లు ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి తెలిపారు.
యువతి అదృశ్యం.. కేసు నమోదు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




