భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా అభివృద్ధిలో విశేష కృషి చేసినందుకు గాను జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖలో సహాయ పౌర సంబంధాల అధికారిగా విధులు నిర్వహిస్తున్న సూగూరు సుభాష్‌ను జిల్లా యంత్రాంగం ఉత్తమ సేవా పురస్కారంతో గౌరవించింది. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి చేతులమీదుగా ఆయన ఈ “ప్రశంసాపత్రాన్ని” అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సుభాష్‌ను అభినందించారు.
ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్న ఏపీఆర్వో సుభాష్





