భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నైనాల గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ఆకుల ప్రమీల ఇంట్లోకి వరద నీరు చేరింది. దీంతో ఇంట్లోని నిత్యావసర సరుకులతో పాటు ఇతర వస్తువులు తడిసిపోయాయి.
విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ యాసం సంధ్య రమేష్ వెంటనే బాధితురాలి ఇంటిని సందర్శించారు. ఇంట్లోకి వరద నీరు చేరిన పరిస్థితిని పరిశీలించి, జరిగిన నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.
భారీ వర్షం…





