భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మున్సిపల్‌లో పెట్రోల్, డీజిల్‌ను అధికారులు, పాలకవర్గ సభ్యులు తమ సొంత వాహనాలకు వినియోగిస్తున్నారంటూ కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని మున్సిపల్ చైర్మన్ సాయికుమార్ తెలిపారు.

మున్సిపల్‌కు సంబంధించిన పెట్రోల్, డీజిల్‌ను ఎలాంటి దుర్వినియోగం చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం మున్సిపల్ వాహనాలకు మాత్రమే నిబంధనల మేరకు పెట్రోల్, డీజిల్ వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మున్సిపల్ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

మున్సిపల్ పెట్రోల్, డీజిల్…