భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: భారీ వర్షంతో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కాచికల్లు, రామన్నగూడెం శివారు ప్రాంతంలో తొర్రూరు–నెల్లికుదురు ప్రధాన రహదారి తెగిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తొర్రూరు నుంచి మహబూబాబాద్‌కు వెళ్లే వాహనాలను అధికారులు దారి మళ్లించారు. బస్సులతో పాటు ఇతర వాహనాలు బొడ్లాడ స్టేజి మీదుగా బ్రాహ్మణ కొత్తపల్లి, నెల్లికుదురు మీదుగా జిల్లా కేంద్రం మహబూబాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నాయి. తొర్రూరు–మహబూబాబాద్ జాతీయ రహదారి మార్గంలో ప్రస్తుతం రోడ్డు పనులు జరుగుతున్న క్రమంలో వరద నీరు…
వరద ఉధృతి.. రోడ్డుపై నిలిచిన బస్సులు





