భారత్ సమాచార్, మెదక్ జిల్లా: సెప్టెంబర్ 17న నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు శాఖల వారీగా కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావుతో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవ…





