భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం రామానుజాపురం గ్రామంలో కొనసాగుతున్న భూముల రీసర్వే పనులను తొర్రూరు ఆర్డీఓ గణేష్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నితీష్ గురువారం స్థానిక తహసిల్దార్ చంద నరేష్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న రీసర్వే ప్రక్రియ, భూ హద్దుల నిర్ధారణ, ప్రభుత్వ భూముల గుర్తింపు తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. రీసర్వే పనుల పురోగతిని సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆర్డీఓ గణేష్ పలు సూచనలు చేస్తూ రీసర్వే పనులను…





