భారత్ సమాచార్, మెదక్ జిల్లా : గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలోని ఇందిరా మహిళా శక్తి విభాగం సీనియర్ మేనేజర్ భవాని శంకర్ మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం శిలాంపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో రెండు నెలల క్రితం ఏర్పాటు చేసిన శరణ్య మునగ ఆకు ఉత్పత్తుల యూనిట్‌ను సందర్శించి, యూనిట్ నిర్వహణ, ఉత్పత్తుల తయారీ తదితర అంశాలను పరిశీలించారు.
యూనిట్ నిర్వాహకురాలు మాసన్నగారి వనజతో భవాని శంకర్ మాట్లాడి, మునగాకు ఉత్పత్తుల తయారీపై ఆలోచన ఎలా వచ్చింది,…





