భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: సింఫనీ హోమ్స్ కాలనీకి సంబంధించి మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని సంగారెడ్డి జిల్లా INTUC, పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొల్కూరి నర్సింహారెడ్డి అన్నారు. సింఫనీ హోమ్స్ కాలనీ 55 ఎకరాల్లో నిర్మించిన 900 విల్లాలను 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చారంటూ హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ అంశంపై వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయాలని కోరుతూ శుక్రవారం పటాన్‌చెరు తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ శేఖర్‌కు వినతిపత్రం అందజేశారు.
…





