భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మండలంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని 19 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి రామాయంపేట మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయులే భావి భారత నిర్మాతలని అన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, క్రమశిక్షణ, విద్యా నైపుణ్యాలను పెంపొందిస్తూ వారిని ఉన్నత లక్ష్యాల వైపు తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను కోరారు.

సభాధ్యక్షత వహించిన మండల విద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల అభ్యున్నతి…