భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: మెండోరా మండలం పోచంపాడ్‌లోని 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను నిజామాబాద్ సర్కిల్ ఎస్ఈ ఆపరేషన్స్ రాజేశ్వర్ రావు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వినియోగదారులకు నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ముందస్తు చర్యలు చేపట్టే లక్ష్యంతో ఈ పరిశీలన నిర్వహించారు. ట్రాన్స్‌కో డీఈ/ఓఅండ్‌ఎం, ఏఈఈ/లైన్స్ అధికారులతో కలిసి సబ్‌స్టేషన్‌లోని విద్యుత్ సరఫరా వ్యవస్థను పరిశీలించారు.
ఈ సందర్భంగా వివిధ ఫీడర్లలో ప్రస్తుతం ఉన్న లోడ్ పరిస్థితి, విద్యుత్ సరఫరా తీరు, పీక్ లోడ్ సమయంలో ఎదురయ్యే సమస్యలు తదితర అంశాలను…





