భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: భూదానోద్యమ పితామహుడు, స్వాతంత్ర్య సమరయోధుడు వినోబా భావే ఆశయాలను నేటి తరాలు కొనసాగించాలని తెలంగాణ సర్వోదయ మండల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, అందోల్ నియోజకవర్గ ఇంచార్జ్ గాజుల అనిల్ కుమార్ అన్నారు. వినోబా భావే 131వ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వినోబా భావే సేవలను స్మరించుకున్నారు.
గాజుల అనిల్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజల ప్రయోజనాల కోసం వినోబా భావే సుమారు 14 సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా…





