భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: మెండోరా మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో పోషణ మాసం సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు, బాలింతలు మరియు చిన్నారుల కోసం అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఏసీడీపీఓ స్వర్ణలత ముఖ్య అతిథిగా హాజరై గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం ప్రాధాన్యతను వివరించారు.

ఈ సందర్భంగా గర్భిణీలకు పండ్లు, పూలు, గాజులు అందించి సంప్రదాయబద్ధంగా శ్రీమంతం నిర్వహించారు. గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన సమతుల్య ఆహారం, పోషక విలువలు…