భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి నిలిచిన పోరాట యోధుడు, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించిన ధీరుడు, స్వాతంత్ర్యం అనంతరం ప్రజాస్వామ్య భారత పార్లమెంట్‌లో వెనుకబడిన తెలంగాణ ప్రాంతాల గొంతుకగా మారిన ప్రజానాయకుడు ఇటికాల మధుసూదనరావు అని సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు దొంతు యాదగిరి (డీవై గిరి) పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాయుధ పోరాటం నుంచి పార్లమెంటరీ రాజకీయాల వరకు సాగిన ఆయన జీవితం తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయమని…