భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: గడీలపై గళమెత్తి, తెలంగాణ రాష్ట్రంలో భూ పోరాటానికి నాంది పలికి, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని పురస్కరించుకుని పటాన్చెరు డివిజన్ పరిధిలోని రజక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన 41వ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే జీఎంఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే…





