భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రానికి చెందిన బ్రాహ్మరౌతు నర్సింగ్‌రావును బెంగళూరులోని అక్కిపేట ఆర్య క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన రచించిన పూర్వ అల్లకొండ ఖిల్లా చరిత్రతో పాటు శ్రీ నిమిషంభిక దేవి చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. బి.ఆర్. నర్సింగ్‌రావు రచించిన “అల్లకొండ - ఊరు ఉద్భవం - ఐదు ఆలయాలకు ప్రసిద్ధి” పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయమని బెంగళూరు ఆర్య క్షత్రియ సంఘం అధ్యక్షులు ఈ. నాగరాజు అన్నారు.…