భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం ఆలేరు క్లస్టర్ పరిధిలోని రైతులు రైతు ఐడి కోసం వెంటనే నమోదు చేసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) మణికంఠ సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలేరు క్లస్టర్ పరిధిలో రైతు ఐడి కోసం ఇప్పటివరకు నమోదు చేసుకోని అన్నదాతలు ఆలస్యం చేయకుండా సంబంధిత అధికారులను సంప్రదించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు.
రైతు ఐడి ప్రతి రైతుకు ఎంతో ప్రాముఖ్యత కలిగినదని ఏఈఓ మణికంఠ తెలిపారు.…





