భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లికుదురు మండలంలోని వివిధ పాఠశాలల నుంచి ఉత్తమ గురువులుగా ఎంపికైన 23 మంది ఉపాధ్యాయులకు శుక్రవారం మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందజేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ రాందాస్‌తో పాటు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొని అవార్డు గ్రహీతలను అభినందించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఉపాధ్యాయులు భావితరాలకు విద్యాబుద్ధులు అందిస్తూ ఆదర్శ సమాజ నిర్మాణంలో…





