భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ నియోజకవర్గంలో విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట్ గేట్ వద్ద బీఆర్ఎస్ నేతలతో కలిసి రైతులు నేషనల్ హైవే 765డీపై రాస్తారోకో నిర్వహించారు. వ్యవసాయ బోర్లు, మోటార్లపై ఆధారపడి సాగు చేస్తున్న తమకు సక్రమంగా విద్యుత్ సరఫరా కాకపోవడంతో పంటలకు సకాలంలో నీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు నీరు లేక ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.