భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జిల్లాలో కోతుల బెడద నుంచి ప్రజలు, రైతులకు ఉపశమనం కల్పించేలా మున్సిపల్ కమిషనర్లు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో సుమారు 6,500 కోతులు ఉన్నట్లు మున్సిపల్ అధికారులు అంచనా వేసిన నేపథ్యంలో సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. కోతుల కారణంగా ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమగ్ర కార్యాచరణను అమలు చేయాలని పేర్కొన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం నుంచి నర్సాపూర్,…





