భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పురపాలక సంఘం పరిధిలోని జడ్పీ బాయ్స్ హైస్కూల్‌లో వినాయక నవరాత్రులను పురస్కరించుకుని ఈకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో మట్టి వినాయక విగ్రహాల ప్రాధాన్యత, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది హాజరయ్యారు.

కార్యక్రమానికి నర్సాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ మాచునూరి లక్ష్మి రాజు యాదవ్ ముఖ్యఅతిథిగా…