భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: రుద్రారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘ఏఐ అనలాగ్, ఇంజనీరింగ్ భవిష్యత్తు’ అనే అంశంపై ఆతిథ్య ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఆస్టర్ క్వాంటా వ్యవస్థాపకుడు, సీఈఓ ప్రదీప్ వి. పైదా ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మారుతున్న సాంకేతిక రంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ), అనలాగ్ టెక్నాలజీల ప్రాధాన్యత, వాటి సమన్వయంతో భవిష్యత్తులో ఇంజనీరింగ్ రంగంలో చోటుచేసుకోనున్న మార్పులను ఆయన వివరించారు.

ఏఐతో పాటు అనలాగ్ టెక్నాలజీలను సమర్థంగా ఉపయోగించుకోవడం ద్వారా వినూత్న సాంకేతిక…