భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: వినాయక చవితి ఉత్సవాలకు ఊరు, వాడ, పట్టణాలు ముస్తాబవుతున్నాయి. పటాన్‌చెరు నియోజకవర్గంలో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భక్తులు, మండప నిర్వాహకులు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. వినాయక విగ్రహాలను కొలువుదీర్చేందుకు మండపాలను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు.

వివిధ ప్రాంతాల్లో గణేష్ మండపాలను ఆకట్టుకునే రీతిలో అలంకరిస్తున్నారు. రంగురంగుల విద్యుత్ దీపాలు, ప్రత్యేక అలంకరణలతో మండపాలను సిద్ధం చేస్తూ ఉత్సవాల సందడిని పెంచుతున్నారు. వినాయక చవితి సమీపిస్తుండటంతో భక్తుల్లో పండుగ ఉత్సాహం నెలకొంది. మండపాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు…