భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి మండలం దేవుని గుట్ట తండా గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గుగులోతు స్వాతి భాస్కర్ లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను అందజేశారు. ప్రభుత్వం అర్హులైన పేద కుటుంబాలను గుర్తించి వారికి రేషన్ కార్డులు మంజూరు చేయడంతో గ్రామంలో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎస్. క్రాంతి కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గుగులోతు స్వాతి భాస్కర్ మాట్లాడుతూ రేషన్ కార్డులు…





