భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: తిరుమలగిరి మండలం వెలిశాల క్రాస్ రోడ్డులోని ప్రాథమిక పాఠశాలను గ్రామ సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్, గ్రామపంచాయతీ కార్యదర్శి అరుణ్‌తో కలిసి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా బోధన, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య నిర్వహణ, పాఠశాల పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. పాఠశాలలోని మౌలిక వసతుల పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సర్పంచ్ విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి చదువు, పాఠశాలలో ఎదురవుతున్న సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు.…





