భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం రామన్నగూడెం పెద్ద చెరువుతో పాటు గొలుసుకట్టు చెరువులన్నింటికీ ప్రధాన జీవనాడిగా ఉన్న కట్టు కాలువకు ఎమ్మెల్యే డా. మురళి నాయక్ సుమారు రూ.40 లక్షలు మంజూరు చేయించి, పూడికతీత, మరమ్మతు పనులు పూర్తి చేయించారు. దీంతో కట్టు కాలువ నుంచి పెద్ద చెరువుకు నీరు ప్రవహిస్తుండటంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా నేత బాలాజీ నాయక్, రావుల సతీష్ ఆధ్వర్యంలో రైతులు ఆదివారం కట్టు కాలువ వద్దకు చేరుకుని ప్రవహిస్తున్న నీటికి…