భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: పటాన్చెరులో కీర్తిశేషులు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి స్మారక ప్రథమ జాతీయస్థాయి ఓపెన్ కరాటే, కుంగ్‌ఫూ ఛాంపియన్‌షిప్ పోటీలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 2 వేల మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. క్రీడలతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని…





