భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరవనిత చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమాన్ని వలిగొండ పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడి, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయురాలు చాకలి ఐలమ్మ అని నాయకులు కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె సాగించిన పోరాటం తెలంగాణ…