భారత్ సమాచార్, మెదక్ జిల్లా: శివంపేట్ మండలం గోమారంలోని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. శుక్రవారం తరగతులను బహిష్కరించి కళాశాల ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. జీవో 97 తమ విద్యాభ్యాసంతో పాటు భవిష్యత్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
జీవో 97కు వ్యతిరేకంగా విద్యార్థులు క్లాసులకు హాజరుకాకుండా బైకాట్ చేశారు. అనంతరం కళాశాల వద్ద ఒకచోట చేరి…





